ఆక్వా రంగంపై పిడుగు.. పెరిగిన మేత, బెల్లం ధరలు!

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగంపై ధరల మోత మోగుతోంది. ఏడాగా మేత ధరలు విపరీతంగా పెరుగుతుండగా, తాజాగా 50 కేజీల బెల్లం ధర రూ.1700కు, తవుడు టన్ను ధర రూ.25వేలకు చేరింది. వనామీ, టైగర్ మేత బస్తాలపై కంపెనీలు రూ.230 నుంచి రూ.300 వరకు ధరలు పెంచడంతో సాగుదారులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.