అకాల వర్షానికి నేలకూలిన రఘునాధపాలెం గ్రామ చారిత్రక మర్రిమాను
రిపోర్టర్: వెంకట్
స్థలం: మఠంపల్లి
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని రఘునాధపాలెం గ్రామ శివారులో తరతరాల జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన చారిత్రక మర్రిమాను అకాల వర్షానికి నేలకూలింది. కృష్ణాపురం వెళ్లే మార్గంలో ఉన్న ఈ మహావృక్షం నీడన రైతులు, గ్రామస్తులు సేదతీరడం ఆనవాయితీ. శ్రీరామనవమి వేడుకలు, పండుగలకు వేదికగా నిలిచిన ఈ చెట్టు కూలిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని, తమ బాల్యపు జ్ఞాపకాలు కనుమరుగయ్యాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.