మెట్రో లవర్ టీజర్ లాంచ్: నవంబర్ 20న సినిమా విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
నరేన్ వనపర్తి, సాహితి అవంచ ప్రధాన పాత్రల్లో మహేశ్ నాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మెట్రో లవర్ అని దర్శకుడు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొని విశేషాలు పంచుకున్నారు. నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఉండనుందని ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు పేర్కొన్నారు.