విజయదశమినాడు గుడి మూసివేత: బాపట్ల జిల్లా మోదుకూరు ఆలయ ప్రత్యేకత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Bapatla
బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల ఆచారాలు చాలా భిన్నంగా సాగుతాయి. ఇక్కడ అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేయకుండా కేవలం దుర్గాష్టమి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. విజయదశమి రోజున మాత్రం దేవాలయ తలుపులు మూసివేసి ప్రత్యేక సంప్రదాయాలను పాటిస్తామని స్థానికులు తెలిపారు. ఈ విభిన్న పూజా విధానాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.