స్వదేశంలోనే పాట్రియాట్ క్షిపణుల తయారీకి జర్మనీ ఆసక్తి

రిపోర్టర్: గోపి స్థలం: Germany

అమెరికాకు చెందిన అధునాతన పాట్రియాట్ గగనతల రక్షణ క్షిపణులను స్వదేశంలోనే తయారు చేసేందుకు జర్మనీ అనుమతి కోరినట్లు రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్షిపణులకు పెరిగిన డిమాండ్, నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూరప్లో అమెరికా ఆయుధాల తయారీని విస్తరించడం ద్వారా అమెరికన్ తయారీదారులపై భారాన్ని తగ్గించవచ్చని జర్మనీ భావిస్తోందని, దీనిద్వారా రక్షణ ఉత్పత్తులను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.