ప్రతిపక్షాల తీరుపై రాజ్నాథ్ సింగ్ నిప్పులు: అరాచకం సృష్టిస్తున్నారని తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: లక్నో
దేశంలో రాజకీయ అరాచకం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నాయకులు యువతను పావులుగా వాడుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల తీర్పును గౌరవించాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు.