రైతుల ఖాతాల్లోకి చేరిన పీఎం కిసాన్ నిధులతో అన్నదాతల హర్షం

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇరవయ్యవ విడత ఆర్థిక సహాయాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.రెండు వేల చొప్పున జమ చేశారు. మోత్కూరు మండలం అనాజిపూర్ గ్రామంలోని రైతు వేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ప్రధానమంత్రి ప్రసంగాన్ని అధికారులు, రైతులు కలిసి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించారు.