శిలాజ ఇంధనాల ప్రాధాన్యతను అంగీకరించిన బ్రిక్స్ దేశాలు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

18వ బ్రిక్స్ సదస్సులో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు శిలాజ ఇంధనాలు కీలకమని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటిస్తూనే, అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని డిమాండ్ చేశాయి. ఈయూ కార్బన్ సరిహద్దు పన్నును బ్రిక్స్ తీవ్రంగా వ్యతిరేకించింది.