లడాక్ పరిహారంపై సోనమ్ వాంగ్చుక్ తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: లడాక్

లడాక్ హింసాత్మక ఘటనల బాధితులకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించిన పరిహారం చాలా తక్కువని, ఇది తన తలదించుకునేలా చేసిందని క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షలు, క్షతగాత్రులకు రూ. 3 లక్షలు ఇవ్వడం దారుణమన్నారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరిపారని, విచారణ కమిటీ నివేదికను తొక్కిపెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.