కోవూరులో కొనసాగుతున్న నామినేషన్లు: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా కోవూరులో నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులురెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. అభ్యర్థులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా నామినేషన్లు వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.