ఫ్లాట్ పిచ్‌ల సంస్కృతిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
క్రికెట్లో బ్యాటర్లకు అనుకూలిస్తూ బౌలర్లను బలిపీఠం ఎక్కిస్తున్న ఫ్లాట్ పిచ్‌ల సంస్కృతిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. ఆధునిక క్రికెట్లో బౌలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, బీసీసీఐ తక్షణమే స్పందించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేవలం పరుగుల వరద పారించడం కోసమే పిచ్‌లను తయారు చేస్తే బౌలర్ల కెరీర్లు నాశనమవుతాయని, పిచ్‌ల తయారీ విధానంలో మార్పులు రావాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు.