డీఎస్సీ అంటే జగన్ పార్టీకి అవినీతేనంటూ నారా లోకేష్ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీకాకుళం

డీఎస్సీ అంటే వైకాపాకు డ్రగ్స్, శాండ్ స్కామ్, చీప్ లిక్కర్ సరఫరా చేయడమేనని మంత్రి నారా లోకేష్ తీవ్రస్థతో మండిపడ్డారు. డీఎస్సీ పేరెత్తితే ఆ పార్టీ నేతలకు అవే గుర్తొస్తాయని ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని ఎత్తిచూపుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగన్ పాలన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.