విజయవాడలో రిటైర్డ్ పోలీస్ సిబ్బంది సంక్షేమ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఎన్టీఆర్

పోలీసు సంక్షేమ దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో రిటైర్డ్ పోలీస్ సిబ్బంది మరియు మృతి చెందిన పోలీసు కుటుంబాల సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు Vijayawada City Police వెల్లడించారు. రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు, నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాలతో అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి. సరిత ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ వేదికగా జీపీఎఫ్, పెన్షన్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, పెండింగ్ బిల్లులు, కార్పస్ ఫండ్ మరియు కారుణ్య నియామకాలపై వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమావేశంలో సుమారు 84 మంది రిటైర్డ్ సిబ్బంది, నిర్దిష్ట కుటుంబ సభ్యులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను అడ్మిన్ డి.సి.పి. ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేశారు.