ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఆరోగ్య రంగంలో పెనుమార్పులు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
విజయవాడలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాక్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర సహకారం, రాష్ట్ర సంకల్పంతో ఏపీ దేశంలోనే నెం.1 స్థానంలో నిలిచిందన్నారు. 500 బెడ్లతో పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని, సంజీవని ప్రాజెక్ట్ గేమ్‌ఛేంజర్‌గా మారుతుందని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుందని తెలిపారు.