రామాయణం సినిమా సంగీతంపై ఏఆర్ రెహమాన్ కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రానికి సంగీతం అందించడం తనకెంతో గౌరవమని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు ఈ అద్భుతమైన ఇతిహాస గాథను ఐదు భాషల్లో తీసుకురావడం పెద్ద బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. హాన్స్ జిమ్మర్తో కలిసి పనిచేయడం చిత్రానికి మరింత ఆకర్షణ తెచ్చిందని, ఈ ప్రాజెక్ట్ పట్ల తనకు ఎంతో నమ్మకం ఉందని ఆయన తెలిపారు.