ఇరాన్పై అమెరికా తీవ్ర హెచ్చరిక: అణ్వాయుధాలు సాధించనివ్వబోమని స్పష్టం చేసిన ట్రంప్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Washington

ఇరాన్పై మరింత దూకుడుగా వ్యవహరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు సాధించేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని గురువారం ఆయన తేల్చిచెప్పారు. గత అధ్యక్షులు చేయాల్సిన పనిని తాము ఇప్పుడు చేస్తున్నామని, అవసరమైతే ఇరాన్పై దాడులను మరింత ముందుకు తీసుకువెళ్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతుండగా, మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.