విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: విజయవాడ
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల అక్రమాలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శాప్ కార్యాలయం వద్ద నిరసనకు యత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్య యుగంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారంటూ ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.