విజయనగరంలో ఘనంగా 'జికె వన్' గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభం

రిపోర్టర్: తాడి స్థలం: విజయనగరం

విజయనగరం తోటపాలెం వద్ద ఎస్.వి.ఎన్ శ్రీనివాస సుజాత గ్రూప్ వారి 'జికె వన్' గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నేడు ఘనంగా ప్రారంభించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ మేయర్ శ్రావణి, సంస్థ ఎండీ గుడిస కౌశిక్ భూమిపూజ నిర్వహించి బ్రోచర్ను ఆవిష్కరించారు.

పట్టణ నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ఈ 3-బెడ్ రూమ్ ప్రాజెక్టుపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. విద్యా, వైద్య, రవాణా సదుపాయాలకు అనువుగా ఉండటంతో, సంస్థ గత ప్రాజెక్టుల నాణ్యతను నమ్మి ప్లాట్ల కోసం కస్టమర్లు పోటీపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు.