హైదరాబాద్‌లో చిరంజీవి 'కాకా' చిత్ర కీలక షెడ్యూల్ ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న 'కాకా' చిత్రం షూటింగ్ ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో పునఃప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. 'ఇది సత్యం మాట.. ఇంకా డౌటా' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఇప్పటికే అంచనాలు పెంచిన ఈ మూవీలో అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.