రష్యా సైన్యంలో చిక్కుకున్న విశాఖ యువకులు: నన్ను రక్షించండి అంటూ కన్నీటి పర్యంతమైన వంశీ

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

రష్యాలో చిక్కుకున్న విశాఖపట్నం యువకుడు వంశీ ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా రష్యాకు వెళ్లిన ఐదుగురు యువకులు సైన్యంలో చేరగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలినట్లు వంశీ తన తల్లికి పంపిన వీడియోలో వాపోయాడు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, తమను రక్షించాలని సీఎంను బాధితుల తల్లిదండ్రులు కోరారు.