తిరుమల పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తిరుపతి జిల్లా
తిరుమల శ్రీవారి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పుణెకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్ అంబేడ్కర్ పర్యవేక్షణలో నిపుణులైన కార్మికులు ఆలయ పైకప్పులు, స్తంభాలను శుభ్రం చేస్తున్నారు. మొదటి దశ పనులు పూర్తికాగా, మిగిలిన భాగాల్లో పనులు కొనసాగుతున్నాయి.