నార్త్ డకోటా గవర్నర్ నివాసంలో తొలిసారిగా ఘనంగా దీపావళి వేడుకలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నార్త్ డకోటా

అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రంలోని బిస్మార్క్ లో ఉన్న గవర్నర్ అధికార నివాసంలో తొలిసారిగా దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కెల్లీ ఆర్మ్స్ట్రాంగ్ దంపతులతో పాటు భారతీయ-అమెరికన్ కుటుంబాలు, సామాజికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. నార్త్ డకోటా అభివృద్ధిలో భారతీయుల సేవలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు.