నాగచైతన్య వృషకర్మ చిత్రం నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ అప్డేట్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ చిత్రానికి సంబంధించి మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో తొలిపాటగా స్వాగ్ ఆఫ్ అర్జున్ గీతాన్ని ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందని వెల్లడించారు.