బొబ్బిలి గ్రోత్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం: పరిశ్రమలో కార్మికుడికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని బెర్రీ అల్లాయిస్ పరిశ్రమలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన ఘటనా స్థలిని పరిశీలించి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని అధికారులు స్పష్టం చేశారు.