టాలీవుడ్లో సరికొత్త మైలురాయి: ఐకాన్జా ఆఫీస్ను ప్రారంభించిన అల్లు అర్జున్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

తన తాతయ్య, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని ఐకాన్జా పేరుతో సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ను ప్రారంభించినట్లు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. తన కెరీర్లో ఇది ఓ నూతన అధ్యాయమని పేర్కొంటూ, తాతయ్య కళా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వేదిక మీదుగానే భవిష్యత్ చిత్రాల ప్రీ-ప్రొడక్షన్ పనులు, నూతన కథా చర్చలు సాగనున్నాయని ఆయన స్పష్టం చేశారు.