ది ప్యారడైజ్ స్పందనలపై హీరో నాని ప్రత్యేక పోస్ట్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

ది ప్యారడైజ్ చిత్రంపై ప్రేక్షకుల స్పందనలు, ప్రేమతో పాటు ట్రోల్స్ను కూడా ఆస్వాదించానని హీరో నాని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ, విమర్శకుల నుంచి వస్తున్న సూచనలను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించి తమదిగా స్వీకరించిన తీరు ఎంతో ఆనందాన్నిచ్చిందని, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు హీరో నాని స్పష్టం చేశారు.