లైంగిక దాడి కేసులో వీన్స్టాన్కు పదిహేనేళ్ల జైలు శిక్ష
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూయార్క్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్స్టాన్కు లైంగిక దాడి కేసులో న్యూయార్క్ కోర్టు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. 2006లో మాజీ టీవీ అసిస్టెంట్ మిరియం హేలీపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. గతంలో పడిన శిక్ష రద్దు కావడంతో జరిగిన పునర్విచారణలో ఆయన దోషిగా తేలారు. ఇప్పటికే ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వీన్స్టాన్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.