గణపయ్య సన్నిధిలో పులకించిన భరతనాట్య ప్రదర్శన

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలం తిరుమలపురంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఘనంగా భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. టీమ్ ఇంట్రో విఘ్నేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయక మండపం వద్ద ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని గ్రామస్థులు కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.