నెల్లూరు జిల్లాలో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం ఆదిరెడ్డిపాలెం శివారులో విషాదం చోటుచేసుకుంది. బచ్చి మండలం దామరమడుగు గ్రామానికి చెందిన మల్లిక శ్రీను అనే వ్యక్తి పొలాల సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.