కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదమన్న మంత్రి
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
కడప జిల్లా కొప్పర్తిలో డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మద్యం విక్రయాల నిబంధనలు, నూతన ప్రాజెక్టులకు భూకేటాయింపులు తదితర కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడినట్లు ఆయన వెల్లడించారు.