బెంగళూరులో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు: నటి రన్యారావుపై జరిమానా

రిపోర్టర్: సురేష్ స్థలం: Bengaluru

నటి హర్షవర్దిని రన్యారావుతో పాటు మరో ముగ్గురికి బెంగళూరు కస్టమ్స్ శాఖ అధికారులు భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేసిన సిండికేట్లో వీరు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మార్చి 2024 నుంచి మార్చి 2025 మధ్య కాలంలో కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నటి రన్యారావుపై ఏకంగా నూట రెండున్నర కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ అధికారులు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు.