దుర్గా పూజ వేళ సిలిగురిలో కలకలం: హిందూ షాపుల్లోనే బిర్యానీ కొనాలంటూ పోస్టర్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: Siliguri

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో దుర్గా పూజ ఉత్సవాల వేళ వెలిసిన కొన్ని పోస్టర్లు తీవ్ర రాజకీయ కలకలం రేపాయి. మాంసం మరియు బిర్యానీని కేవలం హిందువులకు చెందిన దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని ఆ పోస్టర్లలో పిలుపునిచ్చినట్లు హిందూ జాగరణ్ మంచ్ ప్రతినిధి అభిషేక్ దాస్ వెల్లడించారు. హిందువుల ఐక్యతను చాటిచెప్పడానికే ఈ ప్రచారం చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే తన నివాసానికి సమీపంలో వెలిసిన ఈ పోస్టర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శంకర్ ఘోష్ తెలిపారు.