కుప్పంలో తెదేపా కార్యకర్తపైకి వైకాపా జడ్పీ ఛైర్మన్‌ కారు దూసుకెళ్లింది

రిపోర్టర్: రాజేష్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు కారును అడ్డుకునే ప్రయత్నంలో తెదేపా కార్యకర్త సురేష్ కారు బోనెట్ పైనే మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. వైకాపా నాయకుల వాహనాన్ని అడ్డుబోయిన సమయంలో డ్రైవర్ వేగంగా కారు నడపడంతో ఈ ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనపై ఇరువర్గాల నాయకులు రామకుప్పం పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.