ఇరాన్ పై అణు దాడికి ట్రంప్‌ను నెతన్యాహు ఒత్తిడి చేస్తున్నారంటూ టక్కర్ కార్ల్సన్ సంచలనం
రిపోర్టర్: గోపి
స్థలం: Washington
ఇరాన్ పై అణు దాడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒత్తిడి చేస్తున్నారని అమెరికా రాజకీయ వ్యాఖ్యాత టక్కర్ కార్ల్సన్ ఆరోపించారు. మధ్య ఇరాన్ లోని భూగర్భ అణుకేంద్రాలను ధ్వంసం చేసేందుకు అణు ఆయుధాలను వాడే అంశంపై వాషింగ్టన్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తూ సోమవారం ఎక్స్ వేదికగా ఈ సంచలన విషయాలను వెల్లడించారు.