హఫీజ్పేట్లో అమ్మవారి ప్రత్యేక పూజలు మరియు అన్నదానం
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్లో దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు బోయిని అనూష మహేష్ యాదవ్ స్థానిక కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని ఆమె తెలిపారు.