కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలను నిలిపివేయాలని ప్రధాని సలహా మండలి సిఫార్సు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో మారుతున్న జనాభా పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలను తక్షణమే నిలిపివేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. స్టెరిలైజేషన్తో ముడిపడిన అన్ని చెల్లింపులు, ఆశా కార్యకర్తల ప్రోత్సాహకాలు, ప్రపంచ జనాభా దినోత్సవాలు వంటి కార్యక్రమాలను ఆపేయాలని కోరింది. 1952లో ప్రారంభించిన ఈ పథకాలు ప్రస్తుత తరుణంలో అవసరం లేదని తేల్చిచెప్పింది.