నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్ లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని ఈనాడు కథనం వెల్లడించింది. తుపాను ప్రభావం లేకపోయినా అధికారులంతా లెక్కింపు ప్రక్రియకు ఆలస్యంగా వచ్చారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడం, మీడియాకు వివరాలు వెల్లడించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత కౌంటింగ్ ప్రారంభం కావడం, పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు కూడా రాత్రి వరకు వెల్లడించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.