నంద్యాలలో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి

రిపోర్టర్: వెంకట్ స్థలం: నంద్యాల

నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూతన కార్యాలయ ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. భవిష్యత్ కార్యక్రమాలపై నేతలు చర్చించారు. ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో ఈ కార్యాలయం పనిచేస్తుందని నేతలు పేర్కొన్నారు.