తుంగతుర్తిలో ఆసుపత్రి తరలింపు వివాదం: ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ మనోజ్

రిపోర్టర్: అశోక్ స్థలం: తుంగతుర్తి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తుంగతుర్తి మండలం రావులపల్లికి మంజూరైన ముప్ పై పడకల ఆసుపత్రిని గొట్టిపర్తికి మార్చవద్దని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలకు రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో వినతిపత్రం సమర్పించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ఆసుపత్రిని రావులపల్లిలోనే ఉంచాలని ఆయన కోరినట్లు సర్పంచ్ తెలిపారు.