పొన్నం ప్రభాకర్ సవాల్ స్వీకరించిన రామచందర్ రావు: ప్రతి సవాల్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర నేత రామచందర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్లు తొలగించబడ్డాయని చెబుతున్న కనీసం పది మంది బాధితులను ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకురావాలని సవాల్ విసిరారు. పొన్నం సమయం చెబితే తాను అక్కడకు వస్తానని, అవసరమైతే మజ్లిస్ నేతలను కూడా తీసుకురావచ్చని ఘాటుగా ఎద్దేవా చేశారు.