నర్సంపేటలో ఈనెల ముప్పైవ తేదీన భారీ మహాసదస్సు నిర్వహణ

రిపోర్టర్: శేఖర్ స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని ఐఎంఏ హాల్లో ఈనెల ముప్పైవ తేదీన నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్-ఎంఎస్పీ-ఎంఎస్ఎఫ్ మహాసదస్సు కరపత్రాన్ని కాకతీయ కళాతోరణం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. దళితరత్న కల్లెపెల్లి ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.