యూకే ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన యూట్యూబర్ రమా నందన దంపతులు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై బాధితులు హైదరాబాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసి నకిలీ పత్రాలు సమర్పించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.