జలరవాణాకు కూటమి సర్కార్ కసరత్తు: ముక్త్యాల నుంచి మచిలీపట్నం వరకు కార్గో కారిడార్

రిపోర్టర్: రమేష్ స్థలం: Amaravati

రోడ్లపై సరకు రవాణా ఖర్చులను తగ్గించేందుకు జలరవాణా నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కార్గో కారిడార్తో పాటు అమరావతికి వాటర్ మెట్రో, పోలవరానికి పర్యాటక జలరవాణా మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని, సుమారు పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు.