పుర పోరులో కూటమి విజయం: బొబ్బిలి ఓటర్ల భారీ తీర్పు

రిపోర్టర్: గోపి స్థలం: బొబ్బిలి

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగిన పుర పోరులో బొబ్బిలి, సీతానగరం, రామభద్రపురం ఓటర్లు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేసుకున్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విజేతల ముందు ఉందని స్థానికులు పేర్కొన్నారు.