రాయలసీమ అభివృద్ధిని రెండు కుటుంబాలు విస్మరించాయంటూ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: అనంతపురం

అనంతపురంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఆ రెండు కుటుంబాల పాలనతో ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీటి కొరతతో అల్లాడుతున్న సీమలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారని, యువత వ్యక్తి ఆరాధన మాని ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.