రాయలసీమ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఎన్టీఆర్

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. జూన్ 7, 2023న ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ ఇప్పుడు అధికారికంగా నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా రాయలసీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని, ఈ ప్రాంత వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.