కుషాయిగూడ డివిజన్ లో అస్తవ్యస్తంగా రోడ్లు: తీవ్ర నరకం చూస్తున్న స్థానికులు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
కుషాయిగూడ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీ-మార్ట్ మార్గంలో బాక్స్ డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గత కొన్ని నెలలుగా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి కుప్పల కారణంగా తాము నిత్యం నరకం చూస్తున్నామని వాపోయారు. సమస్యపై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు మండిపడ్డారు.