ఘనంగా శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: NTR

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణ కాంత్ పటేల్ పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకత, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.