తీవ్ర వాయుగుండంగా మురసు తుపాను: కోస్తాంధ్ర, తెలంగాణపై తీవ్ర ప్రభావం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Vijayawada
తీవ్ర వాయుగుండం మురసు తుపాను బలహీనపడి కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణపై కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నందిగామ, విజయవాడ, ఖమ్మం ప్రాంతాల సమీపంలో ఇది కొనసాగుతోందని, గత ఆరు గంటలుగా ఉత్తర దిశగా పయనిస్తోందని తెలిపారు. మరో పన్నెండు గంటల్ లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని, మచిలీపట్నం, విశాఖపట్నం రాడార్ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.