స్థల రిజిస్ట్రేషన్ చేయట్లేదంటూ ప్రజావాణిలో బాధితుడు ఉచ్చేవార్ రాజు ఆవేదన
రిపోర్టర్: అశోక్
స్థలం: మద్నూర్
మద్నూర్ మండలంలోని సుల్తాన్పేట్ చౌరస్తాలో తాను కొనుగోలు చేసిన 242 గజాల స్థలానికి యజమాని, గ్రామపంచాయతీ అధికారులు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదని బాధితుడు ఉచ్చేవార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తనకు తక్షణమే న్యాయం చేయాలని ఉచ్చేవార్ రాజు డిమాండ్ చేశారు.